ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి కుటుంబానికి అందాలి : ఏలే మల్లికార్జున్

by Batti.Sumithra |

అర్హులైన ప్రతి కుటుంబానికి తెలంగాణ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అందాలని జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి కుటుంబానికి అందాలి : ఏలే మల్లికార్జున్
X

దిశ, నిజాంసాగర్ : అర్హులైన ప్రతి కుటుంబానికి తెలంగాణ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అందాలని జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజపల్లి గ్రామపంచాయతీ పరిధిలో మంగళవారం ఇందిరమ్మ పథకం లబ్ధిదారులకు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ గోడ గడియారాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పథకం లబ్ధిదారులకు సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా గోడ గడియారాలను అందజేస్తోందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి అర్హులైన కుటుంబానికి చేరేలా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు.

లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని తమ కుటుంబ అభివృద్ధికి ఉపయోగించుకోవాలని సూచించారు. అనంతరం గ్రామంలోని ఓటర్లను కలిసి ప్రత్యేక సమగ్ర ఓటరు నమోదు కార్యక్రమం పై అవగాహన కల్పించారు. ప్రతి అర్హ ఓటరు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవడం ద్వారా ఓటరు జాబితాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు స్వయంగా ప్రత్యేక సమగ్ర ఓటరు నమోదు ఫారాలను అందజేసిన ఏలే మల్లికార్జున్, అర్హులైన ప్రతి ఓటరు నిర్దేశిత గడువులోపు ఫారాలను పూర్తిగా నింపి సంబంధిత అధికారులకు సమర్పించాలని కోరారు. ఎలాంటి సందేహాలు ఉన్నా స్థానిక అధికారులను లేదా బూత్ స్థాయి అధికారులను బీఎల్‌వోలు సంప్రదించి తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీపీఓ శేఖర్, పంచాయతీ కార్యదర్శి భీమ్‌రావు, కారోబార్ సాయిలు, నాయకులు గాండ్ల రమేష్, పసుల రాములు, సత్య గౌడ్, యాసీన్, గాండ్ల కృష్ణ పార్టీ కార్యకర్తలు, ఇందిరమ్మ పథకం లబ్ధిదారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Next Story