చెరువులో రైతు మృతదేహం.. కేసు నమోదు

by Taduka Kalyani |

మండలంలోని పుట్టతోగు గ్రామానికి చెందిన కోండ్రు నాగరాజు (27) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

చెరువులో రైతు మృతదేహం.. కేసు నమోదు
X

దిశ, ములకలపల్లి: మండలంలోని పుట్టతోగు గ్రామానికి చెందిన కోండ్రు నాగరాజు (27) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వృత్తిరీత్యా రైతైన నాగరాజు కొంతకాలంగా పిడ్స్ (కమ్ముళ్లు)తో బాధపడుతూ మందులు వాడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం గ్రామం నుంచి బయటకు వెళ్లిన నాగరాజు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. మంగళవారం గ్రామ శివారులోని చెరువులో అతని మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి సోదరుడు కోండ్రు కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధు ప్రసాద్ తెలిపారు.

Next Story