- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాన్సువాడలో పోలీసుల స్పెషల్ డ్రైవ్
బాన్సువాడ పట్టణంలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.

దిశ, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. నంబర్ ప్లేట్ లేని లేదా ట్యాంపర్ చేసిన నంబర్ ప్లేట్లు కలిగిన వాహనాలను తనిఖీ చేసి సీజ్ చేశారు. అలాగే ఎక్కువ మొత్తంలో పెండింగ్ చలాన్లు ఉన్న వాహనదారులతో అక్కడికక్కడే చలాన్లు చెల్లింపజేశారు. ఈ సందర్భంగా బాన్సువాడ సీఐ తుల శ్రీధర్ మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి మాత్రమే వాహనాలు నడపాలని సూచించారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలకు వెంటనే నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాలని, లేనిపక్షంలో చట్టపరమైన కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. అలాగే వాహనం నడిపే సమయంలో డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్‌సీ), బీమా, కాలుష్య నియంత్రణ (పీయూసీ) ధ్రువపత్రం తదితర వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్ ధరించడం ప్రాణరక్షణకు ఎంతో ముఖ్యమని తెలిపారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






