మహిళ హ్యాండ్‌బ్యాగ్ నుంచి 3 తులాల బంగారం చోరీ!

by Jakkula.Mamatha |

బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఓ మహిళ హ్యాండ్‌బ్యాగ్‌లో ఉన్న సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైన ఘటనపై మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

మహిళ హ్యాండ్‌బ్యాగ్ నుంచి 3 తులాల బంగారం చోరీ!
X

దిశ,మేడిపల్లి: బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఓ మహిళ హ్యాండ్‌బ్యాగ్‌లో ఉన్న సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైన ఘటనపై మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. పీర్జాదిగూడ బాలాజీ ఎన్‌క్లేవ్‌కు చెందిన బనోత్ సుగుణ(51) ఈ నెల 2న రాయంచా ఎన్‌క్లేవ్‌లోని బంధువుల ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో పలు బస్సులు మారుతూ బోడుప్పల్, పీర్జాదిగూడ మార్గంలో ఇంటికి చేరుకున్నారు. అనంతరం హ్యాండ్‌బ్యాగ్‌ను పరిశీలించగా నల్లపూసల బంగారు దండ, రెండు జతల చెవిపోగులు, ఒక జత బుట్టాలు, వజ్రాల చెవిపోగులు, లక్ష్మీదేవి లాకెట్, మూడు బంగారు ఉంగరాలు సహా సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. ప్రయాణ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు హ్యాండ్‌బ్యాగ్‌లో నుంచి ఆభరణాలు అపహరించినట్లు ఆమె మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Next Story