- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెబ్బెన మండలంలో 49 శాతం పూర్తైన ఎస్‌ఐఆర్ సర్వే
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) సర్వే వేగంగా కొనసాగుతోందని తహసీల్దార్ సూర్యప్రకాశ్ తెలిపారు.

దిశ, రెబ్బెన : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) సర్వే వేగంగా కొనసాగుతోందని తహసీల్దార్ సూర్యప్రకాశ్ తెలిపారు. మండలంలో ఇప్పటివరకు 49 శాతం సర్వే పూర్తయిందని ఆయన వెల్లడించారు. మంగళవారం మండలంలోని గొలేటి, రెబ్బెన, నాంబాల, నార్లాపూర్, ఎడవెల్లి గ్రామాల్లో జరుగుతున్న సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాలను ప్రతి ఓటరికి అందజేశామని, వాటిని పూర్తిగా నింపి సంబంధిత బీఎల్‌వోలకు తిరిగి సమర్పించాలని సూచించారు.
ఫారాలు సమర్పించిన వారికే ఓటు హక్కు కొనసాగుతుందని, ఫారాలు సమర్పించని వారు ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. జీపీవోలు, వాలంటీర్లు, బీఎల్‌వోలు, బీఎల్‌వో సూపర్‌వైజర్లు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను సేకరిస్తున్నారని తెలిపారు. ఓటర్లు వారికి పూర్తి సహకారం అందించి, నిర్ణీత గడువులోగా ఫారాలను సమర్పించాలని కోరారు. మండలంలో ఎస్‌ఐఆర్ సర్వే ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతోందని, ప్రతి ఓటరు తమ వివరాలను సరిచూసుకుని, ఎన్యూమరేషన్ ఫారాలను తప్పనిసరిగా సమర్పించి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని తహసీల్దార్ సూర్యప్రకాశ్ విజ్ఞప్తి చేశారు.






