- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డబుల్ మర్డర్ కేసులో కోర్టు సంచలన తీర్పు
గంభీరావుపేట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన రెండు హత్య కేసుల్లో నిందుతుడికి యావజ్జీవ కారాగార (జీవిత ఖైదు) శిక్ష, విధించినట్లు మంగళవారం సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ మహేష్ బి.గితే ఓ ప్రకటనలో తెలిపారు.

దిశ, గంభీరావుపేట: గంభీరావుపేట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన రెండు హత్య కేసుల్లో నిందుతుడికి యావజ్జీవ కారాగార (జీవిత ఖైదు) శిక్ష, విధించినట్లు మంగళవారం సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ మహేష్ బి.గితే ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి.గితే మాట్లాడుతూ.. గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వంగా సందీప్ రెడ్డి భూ వివాదాల నేపథ్యంలో ఇద్దరిని దారుణంగా హత్య చేశాడని తెలిపారు. 2018 మార్చి 17న బీనబోయిన దేవయ్యను కత్తితో దాడి చేసి చంపగా, 2022 జూలై 31న మాన్నె నరసింహులును గొడ్డలితో దాడి చేసి హతమార్చాడని అన్నారు. గంభీరావుపేట పోలీసులు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి నిందితుడిని రిమాండ్‌కు తరలించి, అనంతరం కోర్టులో చార్జిషీట్లు దాఖలు చేశారని తెలిపారు.
కోర్టు విచారణలో భాగంగా అదనపు ఎస్పీ చంద్రయ్య పర్యవేక్షణలో పోలీసులు పక్కా సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించాగా, ప్రాసిక్యూషన్ తరపున అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంటా శ్రీనివాస్ వాదనలు వినిపించగా, శాస్త్రీయ మరియు సాంకేతిక సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేశారని అన్నారు. సమాజంలో నేరం చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష నుండి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. పోలీసుల వ్యూహాత్మక దర్యాప్తు, ప్రాసిక్యూషన్ సమన్వయంతోనే నిందితుడికి శిక్ష పడిందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి కేసుల్లో కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నేరస్తులకు శిక్ష పడేలా చొరవ చూపిన అదనపు ఎస్పీ చంద్రయ్య, అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంటా శ్రీనివాస్, డీఎస్పీ నాగేంద్ర చారి, మరియు సీఐలు మొగిలి, బన్సీలాల్, వెంకటేష్, కోర్ట్ మానిటరింగ్ ఎస్ఐ రవీందర్ నాయుడు, కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్, గంభీరావుపేట ఎస్ఐ శ్రీకాంత్, కోర్టు మానిటరింగ్ కానిస్టేబుల్ నవీన్ లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.






