ఘోర ప్రమాదం.. క్షణ కాలంలోనే వెంటాడిన మృత్యువు!

by Jakkula.Mamatha |

ఓ వ్యక్తిని మృత్యువు వెంటాడి మరీ కాటు వేసిన ఘటన మంగళవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

ఘోర ప్రమాదం.. క్షణ కాలంలోనే వెంటాడిన మృత్యువు!
X

దిశ, తిమ్మాపూర్: ఓ వ్యక్తిని మృత్యువు వెంటాడి మరీ కాటు వేసిన ఘటన మంగళవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. వేములవాడ నుంచి హుజూరాబాద్‌కి బైక్ పై వెళ్తున్న తాళ్లపల్లి రాజేందర్ అల్గునూర్ శివారులోకి రాగానే ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టడంతో రోడ్డుపై కింద పడిపోగా, కాగా అదే సమయంలో వెనక నుంచి వచ్చిన లారీ రాజేందర్ పాలిట మృత్యు శకటం అయింది. ద్విచక్ర వాహనం ఢీ కొనగా స్వల్ప గాయాలయ్యాయని భావించిన స్థానికులు రోడ్డు పై నుంచి పక్కకు తీద్దామనుకునే లోపే క్షణ కాలంలోనే లారీ అతని పై నుండి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన రాజేందర్ ఆత్మకూరు మండలం హనుమకొండ జిల్లాకు చెందిన వ్యక్తి గా పోలీసులు గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

Next Story