- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IND Vs ENG: టాస్ గెలిచిన టీమిండియా.. జట్టులోకి యువ పేసర్ ఎంట్రీ
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవడమే లక్ష్యంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో తలపడుతోంది. నాటింగ్‌హామ్‌లోని చారిత్రాత్మక ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈసారి తుది జట్టులోకి యంగ్ పేసర్ ప్రిన్స్ యాదవ్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే, పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలమైన ఈ పిచ్‌పై ఇంగ్లీష్ జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేయాలనే వ్యూహంతో భారత్ బరిలోకి దిగుతోంది. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్ రేసులో నిలవాలంటే భారత్‌కు ఈ మ్యాచ్‌లో విజయం అత్యంత కీలకం కానుంది. మరోవైపు కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్, తన సారథ్యంలో జట్టుకు మొదటి విజయాన్ని అందించాలనే పట్టుదలతో ఉన్నారు. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ, అద్భుతమైన ఫామ్‌లో ఉన్న వైభవ్ సూర్యవంశీలపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. కాగా, భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు ఇది 50వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కావడం విశేషం.
సిరీస్‌పైనే ఇంగ్లాండ్ కన్ను..
మరోవైపు, హ్యారీ బ్రూక్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌పై తమ పట్టును మరింత బిగించాలని చూస్తోంది. జోస్ బట్లర్, ఫిలిప్ సాల్ట్, సామ్ కర్రన్ వంటి స్టార్ ఆటగాళ్లతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో మొదటి ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 191గా ఉన్న నేపథ్యంలో, అభిమానులకు మరో హై-స్కోరింగ్ మ్యాచ్ ఖాయంగా కనిపిస్తోంది.
భారత జట్టు: అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శివమ్ దూబే, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లాండ్ జట్టు: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్.






