దోపిడీ కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్

by Taduka Kalyani |

మహిళను బెదిరించి నగదు, మొబైల్ ఫోన్ ను దోచుకున్న ముగ్గురు నిందితులను మైలార్ దేవ్ పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.

దోపిడీ కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్
X

దిశ, రాజేంద్రనగర్ : మహిళను బెదిరించి నగదు, మొబైల్ ఫోన్ ను దోచుకున్న ముగ్గురు నిందితులను మైలార్ దేవ్ పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం...కాటేదాన్ లో నివాసం ఉండే పూజ సతీ ఆప్కో కాలనీలో పాన్ షాపు నిర్వహిస్తుంది. గత నెల 26 న పాన్ షాపు మూసి వేసి ఇంటికి వస్తుండగా ముగ్గురు యువకులు మహిళ పై దాడి చేసి ఫోన్, 4,500 నగదును దోచుకొని పారిపోయారు. మహిళా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు మంగళవారం మహమ్మద్ గౌస్ (19), వడ్ల చందు (19), ఆత్మరాజ్ (21) లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 1200 నగదు, ఒక సెల్ ఫోను, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు.

Next Story