- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనరల్ వార్డులలో నీరు..స్విమ్మింగ్ ఫూల్‌లా ఆస్పత్రి
మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో తీవ్రంగా నీరు నిలిచిపోయింది.

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే వర్షాలు ప్రారంభం అవుతున్నాయి. కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే వర్షాలు షురూ కాగా... మరికొన్ని రాష్ట్రాలలో గత రెండు రోజులుగా దంచి కొడుతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నా జిల్లాలో సోమవారం భారీ వర్షం పడింది. ఈ క్రమంలో తొలి వర్షానికి పన్నా జిల్లా ఆసుపత్రి స్విమ్మింగ్ ఫూల్ లా మారిపోయింది.
ఆస్పత్రిలోని వార్డులలో భారీగా వర్షపు నీరు చేరుకుంది. ఈ క్రమంలో రోగులు, వారి బంధువులు, అటు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రిలో నీరు నిలిచిపోవడంతో అంటు వ్యాధులు వ్యాప్తి చెందుతాయని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక ఈ ఆసుపత్రికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో నీరు నిలిచిపోతే, వెంటనే చర్యలు తీసుకోకుండా అధికారులు నిద్రపోయారా? అంటూ మండిపడుతున్నారు. అటు ఈ వీడియోపై ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. వర్షపు నీటిని బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయ్యారు.






