- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్హులైన ఓటర్లను ఎస్ఐఆర్ ప్రక్రియలో నమోదు చేయించాలి
ఎస్ఆర్ఐ ప్రక్రియలో బూతు స్థాయి ఏజెంట్లు అందరూ భాగస్వాములు కావాలని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు.

దిశ, వికారాబాద్ ప్రతినిధి: ఎస్ఆర్ఐ ప్రక్రియలో బూతు స్థాయి ఏజెంట్లు అందరూ భాగస్వాములు కావాలని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. మంగళవారం. వికారాబాద్ పట్టణంలోని సత్య భారతి ఫంక్షన్ హాల్లో ప్రత్యేక సమగ్ర సవరణపై వికారాబాద్ మున్సిపాలిటీ బూతు స్థాయి ఏజెంట్లు మున్సిపల్ కౌన్సిలర్ల తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరు ఓటర్ గా నమోదయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయాలని ఆయన సూచించారు. ఎస్ఆర్ఐ ప్రక్రియ ప్రక్రియ సజావుగా జరిగే విధంగా బిఎల్ఎలు యువత అధికారులకు సహకరించాలని ఆయన తెలిపారు. గ్రామాల్లో మున్సిపల్ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటర్ కార్డ్ నమోదు అయ్యేవిధంగా ప్రజా ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రతి ఓటర్ కు ఎన్యూమరేషన్ ఫారాలు అందే విధంగా బిఎల్ఏ లు బిఎల్ఓ లు సమన్వయంతో పని చేయాలని సభాపతి సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ లక్ష్మీనారాయణ మున్సిపల్ వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి ఎస్ఐఆర్ ట్రైనింగ్ కోఆర్డినేటర్ చైతన్య కృష్ణారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు బూతు స్థాయి ఏజెంట్లు పాల్గొన్నారు.






