సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి

by Batti.Sumithra |

ప్రస్తుత వర్షాకాలంలో వ్యాపించే సీజనల్‌ వ్యాధుల పై ప్రజలకు అవగాహన కల్పించి, అప్రమత్తం చేయాలని డిప్యూటీ డీఏంహెచ్వో నర్సింగ్ చౌహన్ సూచించారు.

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి
X

దిశ, నాగిరెడ్డిపేట్ : ప్రస్తుత వర్షాకాలంలో వ్యాపించే సీజనల్‌ వ్యాధుల పై ప్రజలకు అవగాహన కల్పించి, అప్రమత్తం చేయాలని డిప్యూటీ డీఏంహెచ్వో నర్సింగ్ చౌహన్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను వైద్యాధికారి సృజన్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డెలివరీల సంఖ్యను పెంచాలని, అందులో నార్మల్ డెలివరీ ప్రసవల సంఖ్యను అధికంగా ఉండే విధంగా చూడాలని సిబ్బందికి ఆదేశించారు. ప్రతి రోగికి ఫీవర్ సర్వే నిర్వహించి తగు జాగ్రత్తలు సూచించి మందులు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ సృజన్ కుమార్, సిహేచ్ఓ ఠాకూర్, సూపర్వైజర్ లు సునంద, సుభాషిణి, అనిల్ డేవిడ్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story