- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పృథ్వీ షా, ఆకృతి పెళ్లి క్యాన్సిల్?.. స్పందించిన పృథ్వీ షాకు కాబోయే భార్య
తాను మోసపోయానని, అతని గురించి వచ్చిన ప్రతి రూమర్ నిజమేనని ఇటీవల భారత క్రికెటర్ పృథ్వీ షాకు కాబోయే భార్య ఆకృతి అగర్వాల్ పెట్టిన పోస్టు చర్చకు దారితీసింది.

దిశ, స్పోర్ట్స్ : తాను మోసపోయానని, అతని గురించి వచ్చిన ప్రతి రూమర్ నిజమేనని ఇటీవల భారత క్రికెటర్ పృథ్వీ షాకు కాబోయే భార్య ఆకృతి అగర్వాల్ పెట్టిన పోస్టు చర్చకు దారితీసింది. ఆ పోస్టు షాను ఉద్దేశించే పెట్టిందని, వారికి బ్రేకప్ అయ్యిందని, అతనితో పెళ్లి క్యాన్సిల్ చేసుకుందంటూ ఊహాగానాలు వచ్చాయి. తాజాగా స్పందించిన ఆకృతి ఆ రూమర్లను కొట్టిపారేసింది. ఆ పోస్టు పృథ్వీ షా గురించి కాదని స్పష్టం చేసింది. ‘నాకు కాబోయే భర్త పేరు నేనెప్పుడూ ప్రస్తావించలేదు. మా నిశ్చితార్థం రద్దయ్యిందని గానీ, మేము విడిపోయామని గానీ చెప్పలేదు. నేను పెట్టిన పోస్టు అతని గురించే అని అనుకోవడం దురదృష్టకరం. మేము చాలా సంతోషంగా ఉన్నాం. మా బంధం కొనసాగుతోంది. నా క్లోజ్ ఫ్రెండ్స్ గురించి ఆ పోస్టు చేశాను.’అని ఆకృతి వెల్లడించింది. తనకు కాబోయే భర్త గౌరవానికి సంబంధించిన విషయం కావడంతో తాను స్పందించాల్సి వచ్చిందని చెప్పింది. ప్రజల్లో ఉండే వ్యక్తులను నిజాల కంటే ఊహాగానాల ద్వారానే అంచనా వేస్తారని తెలిపింది.‘ఒక చిన్న పొరపాటు నేను ప్రేమించి వ్యక్తి పరువు తీసేలా చేసింది.’అని ఆకృతి తన పోస్టులో పేర్కొంది. ఆ పోస్టు ఎవరికి సంబంధించినదో తాను స్పష్టం చేయాలనుకోవడం లేదని, కర్మ న్యాయం చేస్తుందని నమ్ముతున్నట్టు తెలిపింది. ఈ ఏడాది మార్చిలో పృథ్వీ షా, ఆకృతికి నిశ్చితార్థం జరిగింది.






