- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘దిశ’ కథనానికి స్పందన.. మాంసం వ్యాపారులకు అధికారుల హెచ్చరిక
మాంసం వ్యాపారులు శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించకుండా విక్రయాలు జరిపినా, ఏ రోజుకారోజు తాజా మాంసం విక్రయించకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని డోర్నకల్ మున్సిపల్ కమిషనర్ నాగరాజు హెచ్చరించారు.

దిశ,డోర్నకల్: మాంసం వ్యాపారులు శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించకుండా విక్రయాలు జరిపినా, ఏ రోజుకారోజు తాజా మాంసం విక్రయించకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని డోర్నకల్ మున్సిపల్ కమిషనర్ నాగరాజు హెచ్చరించారు. ఇటీవల నాసిరకం మాంసం విక్రయాలపై ‘దిశ’ దిన పత్రికలో ప్రచురితమైన కథనంపై మున్సిపల్ అధికారులు స్పందించి వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ వ్యాపారులకు పలు సలహాలు సూచనలు చేశారు. వ్యాపార క్రమంలో వచ్చే వ్యర్థాలను పట్టణానికి దూరంగా నిర్మానుష్య ప్రదేశంలో డంప్ చేయాలన్నారు.
చికెన్, మటన్, చేపల విక్రయ ప్రాంతాలు కుక్కలకు ఆవాసంగా మార్చవద్దని సూచించారు. వానాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో పరిసరాల పరిశుభ్రతతో పాటుగా, వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలన్నారు. స్టోర్ చేసిన మాంసాన్ని విక్రయిస్తే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈగలు, దోమలు, క్రిమి కీటకాలు మాంసంపై ఆవాసం ఏర్పాటు చేసుకోకుండా వర్తక సముదాయంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పది రోజుల గడువులో వ్యాపారులంతా అధికారులు సూచించిన విధంగా ఏర్పాటు చేసుకోవాలని లేనిపక్షంలో నోటీసులు ఇచ్చి దుకాణాన్ని సీజ్ చేస్తామని సూచించారు.






