వేలేరు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సెంట్రల్ జోన్ డీసీపీ

by Jakkula.Mamatha |

హన్మకొండ జిల్లా వేలేరు పోలీస్ స్టేషన్ సెంట్రల్ జోన్ డీసీపీ(DCP) దార కవిత వేలేరు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు.

వేలేరు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సెంట్రల్ జోన్ డీసీపీ
X

దిశ ధర్మసాగర్: హన్మకొండ జిల్లా వేలేరు పోలీస్ స్టేషన్ సెంట్రల్ జోన్ డీసీపీ(DCP) దార కవిత వేలేరు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ తనిఖీల్లో కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్శనలో భాగంగా డిసిపి పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడి, వారి పనితీరును అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌లోని కేస్ డైరీ(CD) ఫైళ్లను, ఇతర ముఖ్యమైన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా డిసిపి సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ‘‘ఆన్‌లైన్ రికార్డులు, కేసుల వివరాలను ఎప్పటికప్పుడు పూర్తిగా అప్‌డేట్ చేయాలి. రోడ్డు ప్రమాదాల వివరాల(Integrated Road Accident Database)లో తక్షణమే, కచ్చితంగా నమోదు చేయాలి. రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచుతూ, వారి వివరాలను ఆన్‌లైన్‌లో క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయాలి. పెండింగ్ కేసుల దర్యాప్తు ప్రక్రియను వేగవంతం చేసి, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలి. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు సిబ్బంది అంతా అంకితభావంతో పని చేయాలి’’ అని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు సూచించారు.

Next Story