ధోనీ క్రేజ్ మాములుగా లేదుగా.. FIFA వరల్డ్‌కప్ స్పెషల్ పోస్ట్

by velandi.Saikiran |

ధోనీ పుట్టిన రోజు నేప‌థ్యంలో FIFA వరల్డ్‌కప్ స్పెషల్ పోస్ట్ పెట్టింది.

ధోనీ క్రేజ్ మాములుగా లేదుగా.. FIFA వరల్డ్‌కప్ స్పెషల్ పోస్ట్
X

దిశ‌, వెబ్ డెస్క్: మహేంద్ర సింగ్ ధోని 45వ వసంతంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. క్రీడా చరిత్రలో అత్యంత స్ఫూర్తిదాయకమైన ప్రయాణాలలో ధోనిది ఒకటి. రైల్వే స్టేషన్ లో టికెట్ కలెక్టర్ గా పనిచేసిన ఆయన.. ఆ తర్వాత భారత జట్టులోకి వచ్చి, కెప్టెన్ గా ఎదిగారు. అదే సమయంలో మూడు ఐసీసీ ట్రోఫీలు కూడా భారత జట్టుకు అందించి చరిత్ర సృష్టించారు ధోని.

మంగ‌ళ‌వారం ఆయన పుట్టినరోజు కావడంతో అంతర్జాతీయ క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ధోని పుట్టినరోజు గురించి FIFA వరల్డ్ కప్ అఫీషియల్ హ్యాండిల్ ఇన్ స్టాలో స్పెషల్ పోస్ట్ చేసింది. వరల్డ్ కప్ లో ప్రస్తుత స్టార్ ప్లేయర్స్ మెస్సీ, ఎంబాపె, హాలాండ్ తలో ఏడు గోల్స్ తో టాప్ లో ఉన్నారు. 7 గోల్స్, తలా ఫర్ ఏ రీజన్ అంటూ వారి ఫోటోతో పోస్టర్ షేర్ చేసింది ఫిఫా వరల్డ్ కప్. హ్యాపీ తలా డే అనే క్యాప్షన్ ఇచ్చింది. మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కూడా సోషల్ మీడియా వేదికగా మహేంద్రసింగ్ ధోనీకి శుభాకాంక్షలు తెలిపారు.





Next Story