ఎల్జీ, శాంసంగ్, హ్యుందయ్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి నారాలోకేష్ భేటీ

by Ajay Maddhiboyina |

మంత్రి నారాలోకేష్ ద‌క్షిణ కొరియా ప‌ర్య‌ట‌న పెటుబ‌డుల ఆక‌ర్ష‌ణే ప్ర‌ధాన ల‌క్ష్యంగా సాగుతోంది. ఎల్జీ ఎల‌క్ట్రానిక్స్, శాంసంగ్, మోబిస్, అపాక్ట్, ఎల్జీ కెమ్ లాంటి దిగ్గ‌జ సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో లోకేష్ భేటీ అవుతున్నారు.

ఎల్జీ, శాంసంగ్, హ్యుందయ్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి నారాలోకేష్ భేటీ
X

దిశ‌, వెబ్ డెస్క్: మంత్రి నారాలోకేష్ ద‌క్షిణ కొరియా ప‌ర్య‌ట‌న పెటుబ‌డుల ఆక‌ర్ష‌ణే ప్ర‌ధాన ల‌క్ష్యంగా సాగుతోంది. ఎల్జీ ఎల‌క్ట్రానిక్స్, శాంసంగ్, మోబిస్, అపాక్ట్, ఎల్జీ కెమ్ లాంటి దిగ్గ‌జ సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో లోకేష్ భేటీ అవుతున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా నేడు ఆటోమోటివ్ మాడ్యూల్స్, కాంపొనెంట్స్, ఎలక్ట్రిఫికేషన్ పరికరాల తయారీ సంస్థ హ్యుందాయ్ మోబిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యంగ్ బిన్ కిమ్ (Mr. Youngbin KIM), వైస్ ప్రెసిడెంట్ హన్సోక్ పార్క్ (Mr. Hanseok PARK), జంగ్‌హో సియో (Mr. Jungho SEO) లతో సియోల్ లో భేటీ అయ్యారు. ఏఐ, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో ఈవీ సెమీ కండక్టర్స్ హబ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

అంతేకాకుండా సెమీకండక్టర్స్, అసెంబ్లింగ్, ప్యాకేజింగ్, టెస్టింగ్(OSAT) రంగంలో పేరుగాంచిన‌ 'అపాక్ట్' (APACT) కంపెనీ సీఈవో సియాంగ్ డాంగ్ లీ (Mr. Seong Dong Lee)తో సియోల్ లో భేటీ అయ్యారు. ASIP భాగస్వామ్యంతో ఏపీలో అపాక్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. OSAT సెమీకండక్టర్ కార్యకలాపాలకు సంబంధించి యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం కోసం ఏపీఎస్ఎస్ డీసీతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని ప్రతిపాదించారు. అదేవిధంగా ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ గ్లోబల్ సీఈవో ల్యూ జె చెయోల్ (Mr. Lyu Jae Cheol), ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా సీఈవో హాంగ్ జు జియోన్ (Mr. Hong Ju Jeon)లతో సియోల్ లోని ఎల్ జీ ట్విన్ టవర్స్ లో విడివిడిగా భేటీ అయ్యారు.

ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ నోయిడా, బెంగళూరు ప్రాజెక్టులను విస్తరిస్తూ విశాఖపట్నంలో ఒక ఇంజనీరింగ్ సెంటర్/జీసీసీ ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు ఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్ & ఎల్జీ ఓవర్సీస్ హోల్డింగ్ కంపెనీస్ హెడ్ యున్-జు కోహ్ (Mr. Yun-ju KOH)తో లోకేష్ భేటీ అయ్యారు. కాకినాడ పోర్టు సమీపంలో పాలీస్టైరిన్ తయారీ కేంద్రం/సముదాయాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దక్షిణ కొరియాలోని ఎల్జీ కెమ్ అధునాతన కార్యకలాపాలను నమూనాగా తీసుకుని, మూలపేటలో ప్రపంచస్థాయి నాఫ్తా క్రాకర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు.

Next Story