- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘దిశ’ ఎఫెక్ట్.. ఒరిజినల్ లైసెన్స్ స్వాధీనం చేసుకున్న వ్యవసాయ శాఖ అధికారులు
by Jakkula.Mamatha |
ముస్తాబాద్ మండలం అవునూర్ గ్రామంలోని వెంకటసాయి ఫర్టిలైజర్స్‌పై రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, ‘దిశ’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.

X
దిశ,ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం అవునూర్ గ్రామంలోని వెంకటసాయి ఫర్టిలైజర్స్‌పై రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, ‘దిశ’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. యూరియా విక్రయాల్లో నిబంధనలు ఉల్లంఘించడం, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలపై తనిఖీలు నిర్వహించిన అధికారులు షాపుకు 'స్టాప్ సేల్' ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా, దుకాణం యొక్క ఒరిజినల్ ఫర్టిలైజర్ లైసెన్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి ఎరువుల విక్రయాలు చేపట్టరాదని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. రైతుల ఫిర్యాదులు, ‘దిశ’ కథనం నేపథ్యంలో అధికారులు వేగంగా స్పందించి చర్యలు తీసుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేసే వారిపై కఠిన చర్యలు కొనసాగించాలని వారు కోరుతున్నారు.
Next Story






