- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
నాచారంలో అత్యాధునిక బాలామృతం ప్లాంట్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు.

దిశ, వెబ్‌డెస్క్: తమ ప్రభుత్వంలో మహిళలన ప్రథమ ప్రాధ్యాన్యత ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఇవాళ ఆయన నాచారం (Nacharam)లోని తెలంగాణ ఫుడ్ ఇండస్ట్రీలో అంగన్‌వాడీ పిల్లకు పౌష్టికాహారం అందించేలా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన బాలామృతం ప్లాంట్ (Balamrutham Plant)ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇవాళ నాచారంలో ప్రారంభించిన బాలామృతం ప్లాంటు నాలుగైదు రాష్ట్రాలకు సరఫరా చేసేలా అభివృద్ధి చెందుతుందని అన్నారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఆలోచనలతోనే ఈ కార్యక్రమం ప్రారంభమైందని తెలిపారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు పరిశ్రమగా మారిందన్నారు. తమ ప్రభుత్వంలో మహిళలకు ప్రాధ్యాన్యత ఉంటుందని, ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరు మీదే నడుస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు.
ఏడాదికి రూ.27 వేల కోట్లు విద్యపైనే..
రాష్ట్రంలో ఇప్పటి వరకు 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Houses)ను నిరుపేదలకు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో భూముల ధరలు వజ్రాలకు మించి ధర పలుకుతోందని అన్నారు. సోలార్ విద్యుత్ కేంద్రాలు, శిల్పారామంలో నైట్ బజార్‌ను మహిళలకే ఇచ్చామని తెలిపారు. 2034లోగా కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ముందుగా పిల్లల ఆరోగ్యాన్ని కాపాడితే.. ఆరోగ్యవంతమైన తెలంగాణ అవతరిస్తుందని అన్నారు. సంపాదించింది మొత్తం విద్య, వైద్యానికి ఖర్చు అవుతోందని.. పిల్లలతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బందికి కూడా బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఏడాదికి రూ.27 వేల కోట్లు పిల్లల చదువులపైనే ఖర్చు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.






