- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బుల్లెట్ ఢీకొని వ్యక్తి మృతి
బుల్లెట్ ఢీకొని తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

దిశ, శంషాబాద్: బుల్లెట్ ఢీకొని తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పెద్దతుప్ర గ్రామానికి చెందిన డి. శ్రీనివాస్ (49) కూలీగా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి గ్రామంలో జరిగిన ఓ డిన్నర్ కార్యక్రమానికి హాజరై రాత్రి 10:05 గంటల సమయంలో తిరిగి వస్తూ గ్రామంలోని కమాన్ సమీపంలో రోడ్డు దాటుతుండగా తిమ్మాపూర్ నుంచి మహేశ్వరం వైపు వేగంగా వెళ్తున్న బుల్లెట్ బైక్ (TS07JV9142) వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ తల, పొట్ట, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు తొలుత శంషాబాద్‌లోని లిమ్స్ ఆస్పత్రికి, అనంతరం గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి భార్య డి. పద్మ ఫిర్యాదు మేరకు శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన బైక్ డ్రైవర్ బనూరి విజయ్ అలియాస్ సంభను ముచ్చింతల్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇన్‌స్పెక్టర్ నరేందర్ రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.






