వరుసగా ఏడో రోజు ’రైతు భరోసా’.. 8 ఎకరాల రైతులకు పెట్టుబడి సాయం జమ

by Kema Shiva Kumar |

రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీ విజయవంతంగా ఏడో రోజుకు చేరింది.

వరుసగా ఏడో రోజు ’రైతు భరోసా’.. 8 ఎకరాల రైతులకు పెట్టుబడి సాయం జమ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా (Rythu Bharosa) పథకం పంపిణీ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా ఏడో రోజు 8 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు నిధులు విడుదల చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Thummala Nageshwar Rao) తెలిపారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 58,831 మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా రూ.259.73 కోట్లను ప్రభుత్వం జమ చేస్తోందని మంత్రి వివరించారు. అయితే, గడిచిన 7 రోజుల్లో ‘రైతు భరోసా’ కింద ప్రభుత్వం మొత్తం రూ.7,750.45 కోట్లను రైతుల ఖాతాల్లోకి బదిలీ చేసిందని వెల్లడించారు. ఈ నిధుల ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 68.96 లక్షల మంది అన్నదాతలకు పెట్టుబడి సాయం చేరిందని, మిగిలిన వారికి కూడా విడతల వారీగా రైతు భరోసా నిధులు జమ అవుతాయని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పష్టం చేశారు.

Next Story