- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంభీర్ కు రెస్ట్..రంగంలోకి కొత్త కోచ్ !
గంభీర్ కు రెస్ట్ ఇచ్చి..లక్ష్మణ్ కు కోచ్ బాధ్యతలు ఇవ్వనున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గౌతమ్ గంభీర్ కు కాస్త రెస్ట్ ఇచ్చి.. రంగంలోకి VVS లక్ష్మణ్ ను దింపే దిశగా అడుగులు వేస్తోంది. గతంలో భారత జట్టుకు అసిస్టెంట్ కోచ్ గా పనిచేసిన లక్ష్మణ్ ను జింబాబ్వే, ఏషియన్ గేమ్స్ కోసం వాడుకునేందుకు రంగం సిద్ధం చేసిందట బీసీసీఐ. ఈ రెండు టోర్నమెంట్లలలో జూనియర్ జట్లు మాత్రమే ఆడుతున్నాయి. సీనియర్ క్రికెటర్లు రెస్ట్ మూడ్ లో ఉన్నారు.
ఇలాంటి క్రమంలో గంభీర్ కు కూడా కొన్ని రోజుల పాటు రెస్ట్ ఇవ్వాలని భావిస్తున్నారట. అందుకే వీవీఎస్ లక్ష్మణ్ ఈ రెండు సిరీస్ ల బాధ్యతలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కాగా జింబాబ్వే సిరీస్ నేపథ్యంలో నిన్న భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ జట్టుకు శ్రేయస్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా, సంజు శాంసన్ పైన వేటు వేశారు. అతని స్థానంలో వైభవ్ స్థానం దక్కించుకున్నాడు. ఏషియన్ గేమ్స్ లో కూడా ఇలాగే ముందుకు వెళ్లే ఛాన్సులు కనిపిస్తున్నాయి.






