- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విఆర్ కాలేజ్ నిర్మాణపు పనులు జరుగుతుండగానే క్లాసుల నిర్వహణ
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం పెద్ద అంబర్‌పేట్ పరిధిలోని కుంట్లూర్ రోడ్డులో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వీఆర్ కాలేజ్ మరోసారి వివాదంలో నిలిచింది.

దిశ: అబ్దుల్లాపూర్ మెట్ : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం పెద్ద అంబర్‌పేట్ పరిధిలోని కుంట్లూర్ రోడ్డులో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వీఆర్ కాలేజ్ మరోసారి వివాదంలో నిలిచింది. ఈ కాలేజీపై దిశలో వరుస కథనాలు ప్రచురితమైన నేపథ్యంలో కాలేజీ నేమ్ బోర్డులను తొలగించినప్పటికీ, భవన నిర్మాణ పనులు కొనసాగుతుండగానే విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా కాలేజీ నిర్వహించడం ఒకవైపు తప్పయితే, నిర్మాణంలో ఉన్న భవనంలోనే విద్యార్థులతో తరగతులు నిర్వహించడం వారి భద్రతను ప్రమాదంలోకి నెట్టే చర్య అని స్థానికులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ పనుల సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై దిశలో వరుస కథనాలు వెలువడుతున్నప్పటికీ, సంబంధిత ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు స్పందించకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి, ప్రభుత్వ అనుమతులు లేని విద్యాసంస్థల్లో విద్యార్థులు చేరకుండా అవగాహన కల్పించాలని, అలాగే నిర్మాణ పనులు జరుగుతున్న భవనంలో తరగతులు నిర్వహిస్తున్న వీఆర్ కాలేజ్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు, స్థానికులు డిమాండ్ చేశారు.






