గిరిజన భవన నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరు:మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

by Jakkula.Mamatha |

ధర్మపురి నియోజకవర్గంలోని అన్ని తండాల్లో మౌలిక వసతుల కల్పన సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.

గిరిజన భవన నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరు:మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
X

దిశ, పెగడపల్లి: ధర్మపురి నియోజకవర్గంలోని అన్ని తండాల్లో మౌలిక వసతుల కల్పన సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. మండలంలోని మద్దులపల్లి, ఏడుమోటాల పల్లి తండా, రాజారాం పల్లి తండాలో బంజారాలు నిర్వహించిన సిత్లా భవానీ వేడుకల్లో మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లంబాడీ మహిళలు సాంప్రదాయ నృత్యంతో మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని తండాలన్నిటికి మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తూ తండాలను అభివృద్ధి చేస్తున్నామని మండలంలోని తండాలన్నిటిని కలుపుతూ రోడ్ల నిర్మాణం కోసం రూ.68 కోట్ల నిధులు మంజూరు చేశామని గుర్తు చేశారు.

మద్దులపల్లి గ్రామంలో గిరిజన భవన నిర్మాణానికి రూ.25 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగిందని అందుకు కావలసిన స్థలాన్ని కేటాయించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. గిరిజనుల ఆరాధ్య దైవం సిత్లా భవానీ ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సయ్యద్ నిజాముద్దీన్, ఎంపీడీఓ ప్రేమ్ సాగర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కడారి తిరుపతి, సర్పంచులు బలరాం రెడ్డి, శ్రీవాణి సుధాకర్ రెడ్డి, రమేష్ నాయక్, జిలా రాకేష్ యాదవ్, నాయకులు ఓరుగలి శ్రీనివాస్, తోట మల్లేశం, సంధి మల్లారెడ్డి, బండారి శ్రీనివాస్, రవి నాయక్, తడగొండ రాజు, దీకొండ మహేందర్, జీవన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Next Story