- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేజ్రీవాల్ కోర్టు వీడియోల వివాదం.. హైకోర్టులో గూగుల్, మెటా కీలక అఫిడవిట్
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కోర్టు విచారణ వీడియోల సర్క్యులేషన్‌పై గూగుల్, మెటా సంస్థలు ఢిల్లీ హైకోర్టులో కీలక అఫిడవిట్ దాఖలు చేశాయి.

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫారమ్‌లలో అప్‌లోడ్ అయ్యే అనధికారిక కోర్టు విచారణల వీడియోలను ముందే (proactively) గుర్తించి, స్క్రీనింగ్ చేసి తొలగించడం సాధ్యం కాదని విషయమని మెటా (Meta), గూగుల్ (Google) సంస్థలు ఢిల్లీ హైకోర్టులో ఇవాళ అఫిడవిట్ దాఖలు చేశాయి. తాము కేవలం మధ్యవర్తులం (Intermediaries) మాత్రమేనని, యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ అయ్యే ప్రతి కంటెంట్‌ను నిరంతరం పర్యవేక్షించే సాంకేతిక సామర్థ్యం కానీ, చట్టపరమైన బాధ్యత కానీ తమకు లేదని పేర్కొన్నాయి. ఏదైనా వీడియోపై నిర్దిష్టంగా నోటీసు ఇస్తే తప్ప అది చట్టవిరుద్ధమా కాదా అని తాము తేల్చలేమని, దానికి పూర్తి బాధ్యత అప్‌లోడర్‌దేనని అఫిడవిట్‌లో మెటా, గూగుల్ స్పష్టం చేశాయి.
కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) కోర్టు విచారణకు సంబంధించిన వీడియోలను కొందరు సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ చేశారు. అయితే, ఇది పూర్తిగా కోర్టు నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని, ఆ వీడియోలను తొలగించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌లో అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్, జర్నలిస్ట్ రవీష్ కుమార్, ఇతరుల పేర్లను చేర్చారు. ప్రతివాదులలో కొందరికి ఇంకా నోటీసులు అందకపోవడంతో జస్టిస్ కామేశ్వర్ రావు, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా ద్విసభ్య ధర్మాసనం కేసు విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.






