సంజు శాంస‌న్ కు మ‌రో షాక్‌..ఇక రీ-ఎంట్రీ క‌ష్ట‌మే ?

by velandi.Saikiran |

జింబాబ్వే సిరీస్‌కు దూరమైన సంజు శాంసన్ కు మరో ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది.

సంజు శాంస‌న్ కు మ‌రో షాక్‌..ఇక రీ-ఎంట్రీ క‌ష్ట‌మే ?
X

దిశ‌, వెబ్ డెస్క్: జింబాబ్వే సిరీస్‌కు దూరమైన సంజు శాంసన్ కు మరో ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఏషియన్ గేమ్స్ 2026 స్క్వాడ్ లోనూ సంజు శాంసన్ చోటు కోల్పోయే ప్రమాదం ఉన్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. గత నెల 30 మందితో ప్రకటించిన భారత స్క్వాడ్ లో ఈ మేరకు మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.

కొత్త జనరేషన్ ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ ఆలోచన చేస్తోందని సమాచారం. ముఖ్యంగా సంజు శాంసన్ స్థానంలో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ తుది జట్టులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా జపాన్ వేదికగా సెప్టెంబర్ 19వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు ఏషియన్ గేమ్స్ జరుగుతాయి. ఈ ఏషియన్ గేమ్స్ లో కూడా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.

Next Story