బడ్జెట్ ఇవ్వకుండా ముఖ్యమంత్రి రెడ్డి పేద కులాల జీవితాలతో చెలగాటం

by Taduka Kalyani |

ఫీజు రీయింబర్స్ మెంట్ పథకానికి బడ్జెట్ ఇవ్వకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద కులాల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆరోపించారు.

బడ్జెట్ ఇవ్వకుండా ముఖ్యమంత్రి రెడ్డి పేద కులాల జీవితాలతో చెలగాటం
X

దిశ, హిమాయత్ నగర్ : ఫీజు రీయింబర్స్ మెంట్ పథకానికి బడ్జెట్ ఇవ్వకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద కులాల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు చదువుకుంటుంటే ఓర్వలేక పోతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో 14 లక్షల మంది కాలేజీ విద్యార్ధుల ఫీజుల బకాయిలు 8 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని, ఈ పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది విద్యార్థులు మంగళవారం బషీర్ బాగ్ చౌరస్తా నుండి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనకు రాష్ట్ర బీసీ విద్యార్ధి సంఘం కన్వీనర్ నిఖిల్ పటిల్, శివ కుమార్ యాదవ్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ, గతంలోని ముఖ్యమంత్రులంతా విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఉంటే ఈ ముఖ్యమంత్రి గొడ్డలితో నరకే తిరోగమన చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్రలు మానుకొని యధాతథంగా అమలు చేయాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తే తెలంగాణ ఉద్యమం తరహాలో ఫీజు పోరు ఉద్యమాన్ని చేపట్టి విద్యార్థుల సత్తా ఎంటో చూపిస్తామని ఎంపీ ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ఈ ప్రదర్శనలో బీసీ సంఘం నాయకులు నీల వెంకటేష్, అనంతయ్య, జిల్లపల్లి అంజి, రాజేందర్, భీం రాజ్, బాలయ్య, వంశీ మోహన్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Next Story