- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ బలోపేతానికి సైనికుల్లా పని చేయాలి
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతినిధులు,కార్యకర్తలు సమిష్టిగా సైనికుల్లా పని చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పిలుపునిచ్చారు.

దిశ, ఆమనగల్లు : కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతినిధులు,కార్యకర్తలు సమిష్టిగా సైనికుల్లా పని చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆమనగల్లు, మాడ్గుల,కడ్తాల్, తలకొండపల్లి మండలాల నూతన అధ్యక్షులుగా ఎన్నికైన నాయకులను ఆయన నివాసంలో శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మండలాల మాజీ అధ్యక్షులను కూడా సత్కరించి, పార్టీకి వారు చేసిన సేవలను కొనియాడారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులు రఘురాములు, శ్రీనివాస్ రెడ్డి మా నయ్య, చేగురి వెంకటేష్ లను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను కార్యకర్తలు గడపగడపకు తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. అనంతరం కల్వకుర్తి నియోజకవర్గం లోని ఆయా మండలాలకు చెందిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బాధితులకు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






