- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
9వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు
సింగరేణి అధికారులకు రావాల్సిన పీఆర్పీ(PRP) బకాయిలు వెంటనే చెల్లించాలని, అధికారుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(CMOAI) ఆధ్వర్యంలో రామగుండం-1 ఏరియాలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం 9వ రోజుకు చేరుకున్నాయి.

దిశ, గోదావరిఖని: సింగరేణి అధికారులకు రావాల్సిన పీఆర్పీ(PRP) బకాయిలు వెంటనే చెల్లించాలని, అధికారుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(CMOAI) ఆధ్వర్యంలో రామగుండం-1 ఏరియాలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం 9వ రోజుకు చేరుకున్నాయి. నాయకులు మాట్లాడుతూ.. సింగరేణి అభివృద్ధికి అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారికి రావాల్సిన పీఆర్పీ బకాయిలు, వేతనాలకు సంబంధించిన ఇతర సమస్యలు యాజమాన్యం ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని కోరారు. అధికారులు చేపట్టిన ఆందోళన న్యాయబద్ధమైనదేనని, వారి డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వానికి, సింగరేణి యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు.
CMOAI నాయకులు మాట్లాడుతూ.. పీఆర్పీ బకాయిల చెల్లింపు, పెండింగ్ సమస్యల పరిష్కారం, అధికారుల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై స్పష్టమైన హామీ వచ్చే వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని తెలిపారు. సింగరేణి అధికారులు అనిల్ గబాలే, బ్రహ్మాజీ రావు, రవీందర్ రెడ్డి, రాజేష్ బాబు, మద్దిలేటి, హనుమంతరావు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని సందర్శించిన రిటైర్డ్ జనరల్ మేనేజర్ త్యాగరాజు, హెచ్‌ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్, మైనింగ్ స్టాఫ్ సూపర్‌వైజర్స్ ప్రతినిధి సాయి, జీడీకే-2 సపోర్ట్ ఉద్యోగులు, జీడీకేసీఎం ఈపీ సంఘీభావం ప్రకటించారు.






