- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజలకు మెరుగైన రహదారులే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ప్రజలకు సౌకర్యవంతమైన రహదారులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

దిశ, తుర్కయంజాల్: ప్రజలకు సౌకర్యవంతమైన రహదారులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని తొర్రూరు డివిజన్‌లో రూ.338 కోట్ల వ్యయంతో హ్యామ్ విధానంలో చేపట్టనున్న నాలుగు లైన్ల ఆధునిక రహదారుల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రామ్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి నాణ్యమైన రహదారులు, ప్రభుత్వ పాఠశాలలు, వైద్య రంగం బలోపేతం కావడం అత్యంత కీలకమన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రూ.338 కోట్లతో ఆధునిక రహదారులు నిర్మిస్తున్నామని, అదనంగా రూ.100 కోట్లతో ఇతర రహదారుల అభివృద్ధికి కూడా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేస్తున్నామని, మరో ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతుందనీ భీమా వ్యక్తం చేశారు. అనంతరం భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ హ్యామ్ విధానంలో నియోజకవర్గంలోని 140 రహదారులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గత పదేళ్లలో జరగని అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేగంగా జరుగుతోందని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన సమర్థవంతంగా కొనసాగుతోందన్నారు.
నియోజకవర్గ రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం కృషి
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆరుట్లలో అన్ని సౌకర్యాలతో తెలంగాణ ప్రభుత్వ పాఠశాలను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. కోహెడలో రూ.2,300 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను ఏర్పాటు చేయడం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. గత ప్రభుత్వం కమిషన్ల కోసమే ఫార్మాసిటీ ప్రాజెక్టును తీసుకువచ్చిందని ఆరోపించిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని రద్దు చేసి ఫ్యూచర్ సిటీకి శ్రీకారం చుట్టిందన్నారు. దీంతో ప్రాంతీయ అభివృద్ధి వేగవంతమవుతుందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు కొత్త కురుమ మంగమ్మ, యువ నాయకులు అభిషేక్ రెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కర చారి, తొర్రూరు డివిజన్ అధ్యక్షులు కోశిక ఐలయ్య, తుర్కయంజాల్ డివిజన్ అధ్యక్షులు ఓర్సు శ్రీనివాస్, సీనియర్ నాయకులు కొత్త కురుమ శివకుమార్, మర్రి నిరంజన్ రెడ్డి, భూపతిగల్లా మహిపాల్, వంగేటి గోపాల్ రెడ్డి, గుండ్లపల్లి హరిత ధనరాజ్, కొంతం వెంకట్ రెడ్డి, కాకుమాను సునీల్, మేతరి దర్శన్, నక్క శివలింగం, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






