మందుబాబులకు అడ్డాగా రైతు వేదిక

by Jakkula.Mamatha |

మండలం కొత్తపల్లి గ్రామంలోని రైతు వేదిక అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

మందుబాబులకు అడ్డాగా  రైతు వేదిక
X

దిశ,మాగనూర్: మండలం కొత్తపల్లి గ్రామంలోని రైతు వేదిక అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రైతుల సమావేశాలు, వ్యవసాయ అవగాహన కార్యక్రమాల కోసం నిర్మించిన రైతు వేదిక వద్ద కొందరు వ్యక్తులు మద్యం సేవిస్తూ కాలక్షేపం చేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రైతులు, మహిళలు, విద్యార్థులు అక్కడికి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు, పోలీసులు వెంటనే స్పందించి రైతు వేదికను రైతుల ఉపయోగానికి మాత్రమే పరిమితం చేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Next Story