- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేవుళ్లను తిట్టే అధికారం మీకు ఎవరిచ్చారు.. ప్రశ్న రావణ్ పై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై వివాదాస్పదవ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన ప్రశ్న రావణ్ వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి షాకింగ్ కామెంట్లు చేశారు. హిందూ దేవుళ్ళు, పీఠాధిపతులపై మాటల దాడులు చేస్తున్న ప్రశ్న జోసెఫ్ రావణ్‌ను జగన్ ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు.

దిశ, వెబ్ డెస్క్: ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై వివాదాస్పదవ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన ప్రశ్న రావణ్ వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ షాకింగ్ కామెంట్లు చేశారు. హిందూ దేవుళ్ళు, పీఠాధిపతులపై మాటల దాడులు చేస్తున్న ప్రశ్న జోసెఫ్ రావణ్‌ను జగన్ ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. దేవుడిని నమ్మడం, నమ్మకపోవడం మీ ఇష్టం.. కానీ దేవుళ్ళను ఉచ్ఛనీచాలు మరిచి తిట్టే అధికారం మీకు ఎవరిచ్చారని అన్నారు. మేధావుల ముసుగులో ఉంటూ హిందూ మత విశ్వాసాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు.
ఒకపక్క 'హే రామ్' అంటూనే, మరోపక్క హిందూ దేవుళ్లను దూషించే ప్రశ్న జోసెఫ్ రావణ్‌ను వెనకేసుకురావడం ఏంటి? అంటూ వైసీపీని ప్రశ్నించారు. పవిత్ర భారతదేశంలో ఆరాధ్య దైవాలైన శ్రీరామచంద్రుడు, సీతమ్మ తల్లి, మహాభారతాన్ని ప్రశ్న జోసెఫ్ రావణ్ ఘోరంగా దూషించాడని మండిపడ్డారు. క్రైస్తవులలో దైవసేవకులు, ముస్లింలలో మతగురువులు ఉన్నట్లే హిందువులలో పీఠాధిపతులు, పూజారులు ఉంటారన్నారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి దేవస్థానాలలో సేవలు అందించే పూజారులను దూషించడం దారుణం అని కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.






