హిమాన్షుకు గాయంపై కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్.. ఆసుపత్రికి చేరుకున్న కేసీఆర్

by Prasad Jukanti |   (  Updated:2026-07-07 11:43:01  IST  )

కుమారుడు హిమాన్షు స్పోర్ట్స్ ఇంజూరీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

హిమాన్షుకు గాయంపై కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్.. ఆసుపత్రికి చేరుకున్న కేసీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గాయం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుమారుడు హిమాన్షు ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. 'నిన్న సాయంత్రం స్పోర్ట్స్ ఆడుతుండగా తన కుమారుడు హిమాన్షు గాయపడినట్లు తెలిపారు. ఈ ఘటనలో అతడు చిన్న గాయం అయిందని ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతోంది. మరో కొన్ని రోజుల్లో అతను పూర్తిగా కోలుకుని సాధారణ స్థితికి వస్తాడు. అతని ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ ఫోన్ చేసిన, సందేశాలు పంపిన ప్రతి ఒక్కరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు' అంటూ ఎక్స్ వేదికగా పోస్టు చేశాడు.

హిమాన్షు ట్వీట్:

తన ఇంజూరిపై హిమాన్షు సైతం ఎక్స్ వేదికగా స్పందించారు. క్రీడలకు సంబంధించిన గాయం కారణంగా నిన్న రాత్రి నేను ఆసుపత్రిలో చేరానని ప్రస్తుతం నేను బాగానే ఉన్నాని పోస్టు చేశారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని కోలుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారని, మీ అందరి అవగాహన, ప్రేమ మరియు మద్దతుకు ధన్యవాదాలు. త్వరలోనే మళ్లీ తిరిగి రావాలని ఆశిస్తున్నాను అంటూ పోస్టు చేశారు. కాగా, గాయపడి చికిత్స పొందుతున్న హిమాన్షు త్వరగా కోలుకోవాలని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఆసుపత్రికి చేరుకున్న కేసీఆర్:

మరో వైపు తన మనవడు హిమాన్షు ను పరామర్శించేందుకు కేటీఆర్ గచ్చిబౌలి AIG ఆసుపత్రికి చేరుకున్నారు. హిమాన్షు గాయపడిన సంగతి తెలిసిన కేసీఆర్ ఇవాళ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి ఆసుపత్రికి బయలుదేరి వచ్చారు. కొద్ది సేపటి క్రితమే ఆయన ఆసుపత్రికి చేరుకుని హిమాన్షు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

Next Story