- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోకాళ్లపై కూర్చొని క్షమాపణలు చెబుతున్నా.. ఇకపై ఎప్పుడూ నిరాశపరచనంటూ రవి మోహన్ ఎమోషనల్ కామెంట్స్
తన జీవితంలో సగానికి పైగా కాలాన్ని సినిమా ఇండస్ట్రీలోనే గడిపానని ఆయన గుర్తు చేసుకున్నారు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ మరో విభిన్నమైన కథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇన్నాళ్లు యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో మెప్పించిన ఆయన ఇప్పుడు పూర్తిస్థాయి పొలిటికల్ థ్రిల్లర్ ‘కరాటే బాబు’ సినిమాతో రాబోతున్నారు. ఈ చిత్రాన్ని ‘డాడా’ ఫేమ్ దర్శకుడు గణేష్ కె. బాబు తెరకెక్కిస్తున్నారు. మాజీ డీజీపీ శంకర్ జివాల్ కుమార్తె దౌదీ జివాల్ ఈ చిత్రంతో హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. కేఎన్ రవికుమార్, కమెడియన్ వీటీవీ గణేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సుందర్ ఆరుముగం నిర్మిస్తున్నారు. ఇప్పటికే వీరి కాంబోలో రెండు చిత్రాలు రాగా.. ముచ్చటగా మూడోసారి ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగస్టు 28న థియేటర్స్‌లోకి తీసుకురాబోతున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఈవెంట్‌లో పాల్గొన్న రవి మోహన్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తన జీవితంలో సగానికి పైగా కాలాన్ని సినిమా ఇండస్ట్రీలోనే గడిపానని ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే ఇటీవల తాను తీసుకున్న ఒక వ్యక్తిగత నిర్ణయం విడాకుల వివాదం వల్ల అభిమానులు, ప్రేక్షకులు అందరూ ఎంతో బాధపడ్డారని.. అది తన మనసును చాలా కలచివేసిందని భావోద్వేగానికి గురయ్యారు. ఆ బాధతోనే స్టేజ్‌పై అందరి ముందు మోకాళ్లపై కూర్చొని క్షమాపణలు కోరారు. ఇకపై ఎప్పుడూ ఎవరినీ నిరాశపరచనని, ప్రేక్షకులను అలరించడమే తన మొదటి లక్ష్యమని జయం రవి స్పష్టం చేశారు. గతంలో తను చేసిన సంతోష్ సుబ్రమణ్యం, ఎమ్ కుమారన్, తని ఒరువన్, పొన్నియిన్ సెల్వన్ సినిమాల్లోని పవర్‌ఫుల్ పాత్రల తరహాలోనే.. ఇప్పుడు రాబోతున్న ‘కరాటే బాబు’ చిత్రంతో సరికొత్తగా, మరింత దృఢంగా మీ ముందుకు వస్తానని చెప్పారు. గతంలో జరిగిన చేదు జ్ఞాపకాలను మర్చిపోయి.. ఇప్పుడు ఎంతో సంతోషంగా ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నట్లు జయం రవి ఈ సందర్భంగా వెల్లడించారు.






