- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జులై 10న విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలి:ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు
రాష్ట్రవ్యాప్తంగా జులై 10న ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కుర్ర రాకేష్ పిలుపునిచ్చారు.

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: రాష్ట్రవ్యాప్తంగా జులై 10న ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కుర్ర రాకేష్ పిలుపునిచ్చారు. బుధవారం సిరిసిల్ల పట్టణంలోని నేతాజీ డిగ్రీ కళాశాలలో బంద్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయని, విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థుల తల్లిదండ్రులపై అధిక ఆర్థిక భారం మోపుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని, విద్యా హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే ప్రైవేటు విద్యాసంస్థల్లో అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని, విద్యాశాఖ మంత్రిని నియమించాలని, సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కళాశాలలో ర్యాగింగ్, విద్యార్థినులపై దాడులు అరికట్టి అందరికీ నాణ్యమైన ఉచిత విద్య అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని పేర్కొన్నారు. జులై 10న జరిగే విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు, ప్రజాస్వామ్యవాదులు సహకరించి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా గర్ల్స్ కన్వీనర్ బర్రెంకల శ్రీహరిక, బోదాస్ ప్రవళికతో పాటు ప్రవర్ష, సంధ్య, అనిల్, భాను, వంశీ, లిఖిత, వైభవ్ తదితరులు పాల్గొన్నారు.






