చిన్నారి జ్ఞానేశ్వ‌రి మిస్సింగ్ కేసు.. ఆ కారు ఎవ‌రిదంటే?

by Ajay Maddhiboyina |

తునిలో అదృశ్య‌మైన చిన్నారి జ్ఞానేశ్వ‌రి మిస్సింగ్ ఘ‌ట‌న‌లో కిడ్నాప్‌కు గురైనరోజు గ్రామంలో తిరిగిన ఓ కారుపై అనుమానాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే.

చిన్నారి జ్ఞానేశ్వ‌రి మిస్సింగ్ కేసు.. ఆ కారు ఎవ‌రిదంటే?
X

దిశ‌, వెబ్ డెస్క్: తునిలో అదృశ్య‌మైన చిన్నారి జ్ఞానేశ్వ‌రి మిస్సింగ్ ఘ‌ట‌న‌లో కిడ్నాప్‌కు గురైనరోజు గ్రామంలో తిరిగిన ఓ కారుపై అనుమానాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. గ్రామంలో తిరిగిన కారుపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. అదే కారు నర్సీపట్నం వద్ద తనను ఢీకొట్టిందని జ్ఞానేశ్వ‌రి బంధువు కోటయ్య ఆరోపించారు. తనను ఢీ కొట్టిన కారు కాడ్నాప్ జరిగిన రోజు గ్రామంలో తిరిగిందని తెలియడం కలకలం రేపింది. అయితే ఆయన కారుపై మరోసారి స్పందించారు. తనను ఢీ కొట్టిన కారు ఈ కారు వేరు వేరని చెప్పారు. తాను పొరపాటు పడ్డానని వీడియో విడుదల చేశారు. ఈ వ్యవహారంపై సీఐ చెన్నకేశవరావు స్పందించారు. అనుమానం వ్యక్తం చేస్తున్న కారును తాము ముందే గుర్తించామని చెప్పారు. సీసీ టీవీలో చూసి కారు నంబర్ ఆధారంగా విచారణ జరిపామని తెలిపారు. ఆ కారు గ్రామంలో జరిగిన ఓ శుభకార్యానికి వచ్చిందని చెప్పారు. ఆ కారుతో ఈ కేసుకు సంబంధం లేదని వివరించారు.

Next Story