- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హిమాన్షుకు ప్రమాదం!.. ఏఐజీ ఆసుపత్రికి కేసీఆర్?
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరికాసేపట్లో హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి రానున్నట్లు తెలుస్తోంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి KCR కాసేపట్లో గచ్చిబౌలిలోని ఏఐజీ (AIG) ఆసుపత్రికి రానున్నారు. కేటీఆర్ కుమారుడు, తన మనవడు హిమాన్షు ప్రమాదానికి గురవడంతో అతడిని పరామర్శించేందుకు కేసీఆర్ వస్తున్నట్లు సమాచారం. మంగళశారం ఉదయం జిమ్ చేస్తుండగా హిమాన్షు ప్రమాదం బారిన పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో హిమాన్షు ముక్కుకు గాయమైనట్లు సమాచారం. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం హిమాన్షు అక్కడే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. మనుమడికి గాయమై ఆసుపత్రిలో చేరారనే విషయం తెలియడంతో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న కేసీఆర్ హుటాహుటిన హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు. కాసేపట్లోనే ఆయన ఏఐజీ ఆసుపత్రికి చేరుకుని హిమాన్షును పరామర్శించనున్నట్లు సమాచారం.
Next Story






