- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మార్వో
by Jakkula.Mamatha |
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మల గ్రామంలోని బాలికల సాంఘీక గురుకుల సంక్షేమ వసతి గృహాన్ని మంగళవారం మధ్యాహ్నం ఎమ్మార్వో మారుతి రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు.

X
దిశ,గంభీరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మల గ్రామంలోని బాలికల సాంఘీక గురుకుల సంక్షేమ వసతి గృహాన్ని మంగళవారం మధ్యాహ్నం ఎమ్మార్వో మారుతి రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వండిన భోజనాన్ని ఎమ్మార్వో పరిశీలించారు. టీచర్స్ మెస్ కమిటీతో భోజనం ఎలా ఉందో ఆరా తీశారు. బియాన్ని పరిశీలించి, బియ్యం స్టాక్ రిజిస్టర్‌ను చెక్ చేశారు. వండే బియ్యాన్ని ఒకరోజు ముందే శుభ్రం చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలని వంట ఏజెన్సీకి సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ ముచ్చటించారు. భవిష్యత్‌లో ఏం కావాలనుకుంటున్నారని, మీ ఆశయం ఏమిటని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. గురుకుల పాఠశాలలో ఏమైనా సమస్యలుంటే పరిశీలించి నివేదిక ఇవ్వాలని చెప్పారు. పాఠశాలలో చదువులు, వసతులు, సమస్యలు తదితర అంశాలను నిశితంగా పరిశీలించారు.
Next Story






