ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్

by Batti.Sumithra |

ఆత్మకూరు మండల పోలీస్‌స్టేషన్‌ను జిల్లా ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్ మంగళవారం తనిఖీ చేశారు.

ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్
X

దిశ, ఆత్మకూరు(ఎం) : ఆత్మకూరు మండల పోలీస్‌స్టేషన్‌ను జిల్లా ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించిన ఆమె, సిబ్బంది పనితీరు, నమోదైన కేసుల పురోగతి వివరాలను ఎస్‌ఐ లక్ష్మీనారాయణను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ స్టేషన్‌ పరిధిలో నేరాల నియంత్రణకు మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి, ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలని సూచించారు. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీలో ఎస్‌ఐ లక్ష్మీనారాయణతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story