నిజామాబాద్ ఘటన మరవకముందే రాష్ట్రంలో మరో ఘోరం.. భర్తను చంపి పూడ్చిపెట్టిన భార్య

by Ajay Maddhiboyina |

నిజామాబాద్‌లో భర్తకు నరాల ద్వారా హార్పిక్ ఎక్కించి హత్య చేసిన భార్య ఉదంతం మరవకముందే రాష్ట్రంలో మరో ఘోరం వెలుగుచూసింది. హైదరాబాద్ మియాపూర్‌లో ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి అనంతరం మహారాష్ట్ర బార్డర్‌లో పూడ్చిపెట్టింది.

నిజామాబాద్ ఘటన మరవకముందే రాష్ట్రంలో మరో ఘోరం.. భర్తను చంపి పూడ్చిపెట్టిన భార్య
X

దిశ‌, వెబ్ డెస్క్: నిజామాబాద్‌లో భర్తకు నరాల ద్వారా హార్పిక్ ఎక్కించి హత్య చేసిన భార్య ఉదంతం మరవకముందే రాష్ట్రంలో మరో ఘోరం వెలుగుచూసింది. హైదరాబాద్ మియాపూర్‌లో ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి అనంతరం మహారాష్ట్ర బార్డర్‌లో పూడ్చిపెట్టింది. అయితే తొమ్మిది నెలల క్రితమే భర్తను హత్య చేయగా ఆలస్యంగా నిజం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది నవంబర్‌లో సత్యవతి అనే మహిళ మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో తన భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు భార్య మొబైల్ ఫోన్ కాల్ డేటా రికార్డింగ్ లను సైతం తీయించారు.

అయితే అందులో ఓ నంబర్ నుండి పదే పదే సత్యవతికి ఫోన్ రావడం, ఎక్కువసేపు మాట్లాడటం గమనించారు. ఆ నంబర్ ఆధారంగా ఫోన్ మాట్లాడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు నిజాలు బయటపడ్డాయి. అక్రమసంబంధానికి అడ్డుగా ఉన్నాడనే భార్య భర్తను హత్య చేసినట్టు నిర్దారించారు. అంతేకాకుండా కేసు నుండి బయటపడేందుకు ఎలాంటి ఆధారాలు దొరకకుండా ప్లాన్ చేసినట్టు విచారణలో తేలింది. నవంబర్ లో హత్యకు ముందు భర్తకు అన్నంలో నిద్రమాత్రలు కలిపింది.

అతడు నిద్రలోకి జారుకున్న తరవాత దిండుతో ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. తరవాత ప్రియుడితో కలిసి మహరాష్ట్ర బార్డర్ కు తీసుకువెళ్లి మరో స్నేహితుడితో కలిసి పెట్రోల్ పోసి తగలబెట్టింది. అనంతరం మిగిలిన శరీరాన్ని పూడ్చిపెట్టారు. తొమ్మిది నెలల తరవాత అసలు విషయం బయటపడటంతో పోలీసులు మహారాష్ట్ర పోలీసుల సహకారంతో డెడ్ బాడీని వెలికితీశారు. ఈ ఘటనకు సంబంధించి రేపు మధ్యాహ్నం పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం అందుతోంది.

Next Story