Vishakha: సముద్రంలో ముగిసిన సెర్చ్ ఆపరేషన్.. త్రిసభ్య కమిటీకి SAR నివేదిక అందజేత

by Kema Shiva Kumar |

విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ ముగిసింది.

Vishakha: సముద్రంలో ముగిసిన సెర్చ్ ఆపరేషన్.. త్రిసభ్య కమిటీకి SAR నివేదిక అందజేత
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ ఫిషింగ్ హార్బర్ (Visakha Fishing Harbour) నుంచి చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ ఎట్టకేలకు ముగిసింది. ఇండియన్ నేవీతో పాటు కోస్ట్ గార్డ్ (Indian Coast Guard) సిబ్బంది సముద్ర గర్భంలో దాదాపు మూడు రోజులు జల్లెడ పట్టారు. అయినా, వారి ఆచూకీ లభించకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ ముగిసినట్లుగా అధికారులు వెల్లడించారు. అయితే, వేటకు వెళ్లిన ఆరుగురు మత్య్సకారుల్లో కారి చిన్నా అనే ఒకేఒక్కడు మాత్రం సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు తమ వారు సురక్షితంగా తిరిగి వస్తారని ఆశించిన మత్స్యకారుల కుటుంబ సభ్యులు, బంధువులు విశాఖ తీరంలో గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. ఇక సెర్చ్ ఆపరేషన్‌కు సంబంధించి SAR రిపోర్టును ఇండియన్ నేవీతో పాటు కోస్ట్ గార్డ్ సిబ్బంది త్రిసభ్య కమిటీకి అందజేసింది. వారు సమగ్ర నివేదకను తయారుచేసి ప్రభుత్వానికి అందజేస్తే పరిహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయానికి రానుంది. ఆ త్రిమెన్ కమిటీలో స్థానిక ఆర్డీవో, ఏసీపీ, ఫిషరీస్ ఏడీకి చోటు కల్పించారు.

ఒకరిని కాపాడిన వాణిజ్య నౌక..

సముద్రంలో ప్రాణాల కాపాడుకునేందుకు కొట్టుమిట్టాడుతున్న మత్స్యకారులలో కారి చిన్నా అనే వ్యక్తిని నిన్న ఆ మార్గంలో వెళ్తున్న ఓ అంతర్జాతీయ వాణిజ్య నౌక సిబ్బంది గమనించి సురక్షితంగా రక్షించారు. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో కోస్ట్ గార్డ్ సిబ్బంది చిన్నాను రెస్క్యూ బోటు ద్వారా తిరిగి విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు తీసుకొచ్చారు. ప్రస్తుతం అతడు క్షేమంగానే ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు.

Next Story