- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్లైఓవర్ పై నుంచి దూకి వ్యక్తి మృతి
by Taduka Kalyani |
మండల కేంద్రం సమీపంలో కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో గల నేషనల్ హైవే ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద నుంచి మద్యం మత్తులో యువకుడు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

X
దిశ,కూసుమంచి: మండల కేంద్రం సమీపంలో కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో గల నేషనల్ హైవే ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద నుంచి మద్యం మత్తులో యువకుడు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని నేలపట్ల గ్రామానికి చెందిన తుడుం.వీరబాబు(36) అనే వ్యక్తి కుటుంబ పరిస్థితుల దృష్ట్యా మద్యానికి బానిసై జీవితం మీద విరక్తితో మంగళవారం సాయంత్రం కూసుమంచి జాతీయ రహదారి బ్రిడ్జి మీద నుండి అందరూ చూస్తుండగానే దూకాడు. తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు వీరబాబు కుమారుడు చనిపోవడం, భార్య వదిలి వెళ్లడం వంటి కారణాలతో మద్యానికి బానిసై ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. ఘటనపై కూసుమంచి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






