- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆరోజే పవన్ కల్యాణ్ సీఎం అవుతారు.. జనసేన ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
కాకినాడ సిటీ ఎమ్మెల్యే, జనసేన నాయకులు పంతం నానాజీ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ఓ మంచి ఉద్దేశ్యంతో పార్టీని స్థాపించారని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ సిటీ ఎమ్మెల్యే, జనసేన నాయకులు పంతం నానాజీ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ఓ మంచి ఉద్దేశ్యంతో పార్టీని స్థాపించారని అన్నారు. రేపే పదవిలోకి వస్తానని, ఎల్లుండి పదవిలోకి వస్తానని ఆయన ఏ రోజు చెప్పలేదని వ్యాఖ్యానించారు. మీకు కూడా రేపే పదవులు ఇస్తానని తమతో ఏనాడు అనలేదని అన్నారు. ఒక సిద్ధాంతం, ఒక వ్యవహారం పాతికేళ్ల ప్రస్థానంతో ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి అనుకున్న రోజునే అవుతారని చెప్పారు. అంతేకానీ దొడ్డిదారిలో ముఖ్యమంత్రి అవ్వడానికి ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేయరని అన్నారు.
ఆయన తన సిద్ధాంతాలతో ముందుకు వెళుతూ ప్రజలు దానిని ఆమోదించిననాడే సీఎం అవుతారని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ చంద్రబాబు, తరవాత లోకేష్ ను సీఎం చేయడానికే పార్టీ పెట్టారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. పవన్ సీఎం అవ్వడానికి పార్టీ పెట్టలేదని, రాష్ట్రంలో టీడీపీని, కేంద్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు పార్టీ పెట్టారని విమర్శిస్తున్నారు. ఈ విమర్శలపై పవన్ కల్యాణ్ అనేకసార్లు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే సైతం పవన్ పై వస్తున్న విమర్శలకు క్లారిటీ ఇచ్చారు.






