- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధర్మారం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీసీపీ రాంరెడ్డి
by Jakkula.Mamatha |
ధర్మారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను పెద్దపల్లి డీసీపీ భూక్య రాంరెడ్డి నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

X
దిశ,ధర్మారం: ధర్మారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను పెద్దపల్లి డీసీపీ భూక్య రాంరెడ్డి నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణను పరిశీలించిన తర్వాత, రికార్డులను తనిఖీ చేశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ రాంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు సివిల్ కేసుల వ్యవహారాల్లో పలు సూచనలు చేశారు. భూ వ్యవహారంలో పోలీసుల జోక్యం అసలు ఉండదని స్పష్టం చేశారు. సివిల్ కేసుల వ్యవహారంలో పోలీస్ స్టేషన్‌కు రాకుండా, కోర్టులను, రెవెన్యూ శాఖ అధికారులను ఆశ్రయించాలని సూచించారు. డ్రగ్స్ విషయంలో పిల్లల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ సందర్శనలో డీసీపీ వెంట ఏసీపీ జి.కృష్ణ, సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై ఎం.ప్రవీణ్ కుమార్‌తో పాటు సిబ్బంది ఉన్నారు.
Next Story






