- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'నా శాఖతో అతనికేం సంబంధం?'.. కడియంపై మంత్రి కొండా సురేఖ ఏఐసీసీకి ఫిర్యాదు
మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. కడియం తీరుపై మంత్రి ఏకంగా కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అయింది.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. తన శాఖలో కడియం శ్రీహరి జోక్యం చేసుకోవడం పట్ల ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న దేవాదాయ కమిషనర్ ఆఫీసులో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని నా ఆఫీసులో నాకు తెలియకుండా నా శాఖ అధికారులతో రివ్యూ చేయడం ఏంటని సురేఖ మండిపడ్డారు. ఈ మేరకు కడియం శ్రీహరి తీరుపై ఏకంగా కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి ఫిర్యాదు చేయడంతో ఇద్దరి మధ్య పొలిటికల్ కుమ్ములాట హాట్ టాపిక్ గా మారింది.
ఈ మధ్య సయోధ్య ఇంతలోనే..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయ వ్యవహారం సాగుతోంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో గతంలో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఆ క్రమంలో మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళిపై కడియం శ్రీహరి తో పాటు ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు ఏకంగా రాష్ట్ర నేతలకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో కొండామురళి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరు కూడా అయ్యారు. ఈ రెండు వర్గాల మధ్య వివాదం ముదిరి పార్టీకి డ్యామేజ్ చేయబోతోందని భావించిన పార్టీ పెద్దల గాంధీ భవన్ వేదికగా జోక్యం చేసుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఇప్పుడిప్పుడే వీరి మధ్య సయోధ్య కుదిరి వివాదం సద్దుమణిగిందని అంతా భావిస్తున్న తరుణంలో తాజాగా కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ ఏఐసీసీకి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజా పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్‍లో ఎలాంటి పరిస్థితులకు దారి తీయబోతున్నాయో మరి!.






