మెట్టుగూడ, తార్నకలో అక్రమ వైన్ తయారీ భగ్నం..

by Taduka Kalyani |

సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మెట్టుగూడ, తార్నక ప్రాంతాల్లో అక్రమంగా వైన్ తయారు చేస్తున్నారనే సమాచారంతో సికింద్రాబాద్ డీటీఎఫ్ సీఐ సౌజన్య ఆధ్వర్యంలో ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.

మెట్టుగూడ, తార్నకలో అక్రమ వైన్ తయారీ భగ్నం..
X

దిశ, సికింద్రాబాద్: సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మెట్టుగూడ, తార్నక ప్రాంతాల్లో అక్రమంగా వైన్ తయారు చేస్తున్నారనే సమాచారంతో సికింద్రాబాద్ డీటీఎఫ్ సీఐ సౌజన్య ఆధ్వర్యంలో ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రెండు వేర్వేరు కేసులను నమోదు చేసి, ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మెట్టుగూడలోని హౌస్ నెం. 12-7-190లో నిర్వహించిన తనిఖీల్లో 25 వైన్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని నిందితుడు ఆంటోనిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే తార్నకలోని ఆర్టీసీ ఆసుపత్రి సమీపంలో నిర్వహించిన మరో దాడిలో సుమారు 20 లీటర్ల అక్రమంగా తయారు చేసిన వైన్‌ను స్వాధీనం చేసుకుని వేణు, ప్రకాశ్లను అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న వైన్ మొత్తం విలువ సుమారు రూ.50 వేలగా అధికారులు అంచనా వేశారు. నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న వైన్‌ను సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించి, కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

Next Story