- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండస్ట్రీలో గోల్డెన్ స్పూన్లు పనిచేయవు.. నిర్మాత సెన్సేషనల్ కామెంట్స్!
గ్రౌండ్ లెవెల్ నుంచి కష్టపడితేనే ఇండస్ట్రీలో నిజమైన విజయం దక్కుతుందని రవిశంకర్ అన్నారు.

దిశ, సినిమా: ప్రముఖ ప్రొడ్యూసర్ రవిశంకర్ ఓ సినిమా ఈవెంట్‌లో భాగంగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. రాజా ది రాజా మూవీ ట్రైలర్ లాంచ్‌లో పాల్గొన్న ఆయన ఇండస్ట్రీలోకి ఎవరైనా సరే గోల్డెన్ స్పూన్ లేదా డైమండ్ స్పూన్‌తో పుట్టి రావచ్చు కానీ, ఇక్కడ సక్సెస్ అవ్వడానికి ఆ స్పూన్లు ఏమాత్రం పని చేయవని స్పష్టం చేశారు. సినిమా పరిశ్రమలో ఒక నటుడిని లేదా నటిని నిలబెట్టేది, ముందుకు నడిపించేది కేవలం వారిలో ఉన్న స్వయం ప్రతిభ మాత్రమేనని ఆయన తేల్చి చెప్పారు. ఎంత పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ.. అది కేవలం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి మాత్రమే పనికొస్తుందని, అంతేకానీ థియేటర్లలో ప్రేక్షకుల ఆదరణ పొందడానికి అది ఏమాత్రం సరిపోదని వివరించారు.
ఇదే వేదికపై కొత్తగా సినీ రంగంలోకి అడుగుపెడుతున్న యంగ్ హీరో హీరోయిన్లకు, నటీనటులకు ఆయన ఒక పవర్‌ఫుల్ మెసేజ్ కూడా ఇచ్చారు. మన వెనుక ఎవరి అండా లేదు, మనల్ని నడిపించే గాడ్‌ఫాదర్ ఎవరూ లేరని మనసులో బలంగా అనుకుని.. గ్రౌండ్ లెవెల్ నుంచి కష్టపడితేనే ఇండస్ట్రీలో నిజమైన విజయం దక్కుతుందని రవిశంకర్ అన్నారు. సినిమా పట్ల మనకు ఉండే అంకితభావం, క్రమశిక్షణ, నిరంతరం కష్టపడే తత్వమే మన కెరీర్‌ను నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రొడ్యూసర్ రవిశంకర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్‌లో ఉన్న స్టార్ కిడ్స్, వారసత్వంతో వస్తున్న హీరోలను ఉద్దేశించే ఆయన ఇంత ఘాటుగా స్పందించారని నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.






