- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదుపుతప్పి బోల్తా పడిన ఇసుక టిప్పర్.. డ్రైవర్ అక్కడికక్కడే మృతి
by Jakkula.Mamatha |
మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాదన్ పల్లి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ నరేష్(25) అక్కడికక్కడే మృతి చెందాడు.

X
దిశ, మక్తల్: మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాదన్ పల్లి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ నరేష్(25) అక్కడికక్కడే మృతి చెందాడు. నర్వ నుంచి జక్లేర్ వైపు ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నారాయణపేట మండలం శేర్నపల్లికి చెందిన డ్రైవర్ నరేష్ వాహనం కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. ఆ కుటుంబానికి ఒక్కడే కొడుకు కావడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న మక్తల్ పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
Next Story






