- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రంగారావుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నాగుపాము కలకలం
by Jakkula.Mamatha |
మండలంలోని రంగారావుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నాగుపాము కలకలం సృష్టించింది.

X
దిశ,గంగాధర: మండలంలోని రంగారావుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నాగుపాము కలకలం సృష్టించింది. కార్యాలయం ప్రహరీ గోడ వైపు నుంచి ఒక్కసారిగా ఓ నాగుపాము లోపలి రూములోకి చొరబడింది. దీన్ని గమనించిన పంచాయతీ సిబ్బంది, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు. వెంటనే గర్శకుర్తి గ్రామానికి చెందిన స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ నాగరాజు అత్యంత చాకచక్యంగా గదిలోకి వెతికి, నాగుపామును పట్టుకున్నారు. అనంతరం ఆ పామును సురక్షితంగా ప్లాస్టిక్ సీసా లో బంధించడంతో స్థానికులు, పంచాయతీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత ఆ నాగుపామును ఎవరికీ హాని కలగని విధంగా సురక్షితమైన(నిర్జీవ) ప్రాంతంలో వదిలిపెట్టినట్టు నాగరాజు తెలిపారు. సమయానికి స్పందించి పామును పట్టుకున్న నాగరాజును గ్రామస్థులు అభినందించారు.
Next Story






