- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాక్రోచ్ జనతా పార్టీ కి బిగ్ రిలీఫ్.. ఆంక్షలు ఎత్తివేయాలి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ‘X’ అకౌంట్‌పై నిషేధం ఎత్తివేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం.. నీట్ పరీక్షలు ముగియడంతో కోర్టు కీలక నిర్ణయం!

దిశ, వెబ్ డెస్క్: వివాదాస్పద రాజకీయ/సోషల్ మీడియా గ్రూప్ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా పై విధించిన నిషేధాన్ని తక్షణమే ఎత్తివేయాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్ స్వర్ణ కాంత శర్మ (Justice Swarna Kanta Sharma) నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ మేరకు కీలక తీర్పునిచ్చింది. ప్రస్తుతం నీట్ (NEET) పరీక్షల ప్రక్రియ ముగిసినందున, ఈ అకౌంట్‌ను ఇకపై కూడా బ్లాక్‌లో ఉంచాలన్న కేంద్ర ప్రభుత్వ (Central Govt) ఆందోళనకు పెద్దగా ఆస్కారం లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది.
విద్యార్థులను గందరగోళానికి గురిచేశారన్న ఎస్‌జీఐ..
విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (SGI) తుషార్ మెహతా కోర్టుకు తమ వాదనలు వినిపించారు. నీట్ ఎగ్జామ్ సమయంలో ఈ పార్టీ అకౌంట్ ద్వారా వచ్చిన పలు పోస్టులు, ప్రచారాలు పరీక్ష రాసే లక్షలాది మంది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను తీవ్ర గందరగోళానికి, ఆందోళనకు గురి చేసేవిగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. శాంతిభద్రతలు, పరీక్షల పారదర్శకతను దృష్టిలో ఉంచుకునే ఐటీ చట్టం కింద ఆ ఖాతాను తాత్కాలికంగా బ్లాక్ చేయాల్సి వచ్చిందని వివరించారు. అయితే, పరీక్షల ఘట్టం ముగిసిపోవడంతో వ్యక్తీకరణ స్వేచ్ఛను పరిగణనలోకి తీసుకుని సదరు ‘X’ అకౌంట్‌పై ఉన్న సస్పెన్షన్‌ను తొలగించాలని హైకోర్టు స్పష్టం చేసింది.






